ప్రాణం తీసిన దాగుడుమూతలాట.. పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి
kumram bheem asifabad | ఓ బాలుడు.. తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం
కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ బాలుడు.. తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలాట ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాస్-రమా దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. నాలుగో తరగతి చదువుతున్న అభిషేక్ (10)తన తమ్ముడు, చెల్లితో కలిసి సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయానికి వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాలేదు.
అభిషేక్ దాగుడుమూతల ఆట ఆడుకుందామని చెప్పాడు. తమ్ముడు, చెల్లికి దొరకకూడదని ఇంటిలో నిల్వ ఉంచిన పత్తిలో చిన్న రంధ్రం చేసుకొని అందులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ముందుగా తల పెట్టే సరికి కాళ్లు పైకి లేచిసరికి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు.. అపస్మారక స్థితిలో ఉన్న అభిషేక్‌ను కౌటాలలోని దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులతో పాటు పిల్లల రోదనలు అక్కడున్న వారికి కంటతడి పెట్టించాయి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

