తిరువనంతపురం : హెల్త్ సెంటర్లో ఒంటరిగా ఉన్న నర్సుపై లైంగిక దాడికి యత్నించిన 65 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కేరళలోని కొచ్చి సమీపంలో మూతకున్నం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగుచూసింది. హెల్త్ సెంటర్ను తరచూ సందర్శించే వ్యక్తి ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లాడు.
ఆ సమయంలో నర్సు ఒంటరిగా ఉండటం గమనించిన నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. నర్సు పెద్దగా కేకలు వేయడంతో స్ధానికులు అక్కడికి చేరుకోగా నిందితుడు పరారయ్యాడు. నర్సు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వదకెక్కర పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఆదేశంతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.