Venkatadri Express | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై 30 మంది గ్యాంగ్ రాళ్ల దాడి.. సినీఫక్కీలో పోలీసుల చేజింగ్
Venkatadri Express | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై శంషాబాద్ సమీపంలోని తిమ్మాపూర్ వద్ద 30 మంది గ్యాంగ్ రాళ్ల దాడికి తెగబడింది. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకోవడానికి యత్నించారు. కానీ వారు తప్పించుకుని పారిపోయారు. సినీ ఫక్కీలో చేజింగ్ చేసి ఇద్దరు మహిళలను మాత్రం పట్టుకున్నారు
Venkatadri Express | ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపింది. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు అప్రమత్తమవ్వడంతో దుండుగులు పారిపోయారు. ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు సినీఫక్కీలో పోలీసులు చేజింగ్ చేశారు. కానీ 30 మంది గ్యాంగ్ తప్పించుకుని వెళ్లింది. అయితే గ్యాంగ్‌లోని ఇద్దరు మహిళలు మాత్రం పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయల్దేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ దాటుతున్న సమయంలో ట్రాక్ పక్కన 30 మంది గ్యాంగ్ మాటు వేసి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించింది. కిటికీలు, బోగీలకు రాళ్లు తగలడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ఆ గుంపును గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులపైనే ఎదురుదాడి..
గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా.. సుమారు 30 మంది గుంపు పోలీసులనే రౌండప్ చేసి దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాల సాయం కోరారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో వారిని కిలోమీటర్ల మేర ఛేజ్ చేశారు. కానీ నందిగామ మండలంలోని పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్సీఎల్ వెంచర్ గుండా పరుగులు తీసి చీకట్లో తప్పించుకున్నారు. కానీ ఇద్దరు మహిళలు మాత్రం పోలీసులకు చిక్కారు. వారిని బిహార్, ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన ముఠాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణలో పొంతన లేని సమాధానాలు
అరెస్టయిన ఆ ఇద్దరు మహిళలను విచారించగా, తాము రుద్రాక్ష మాలలు అమ్ముకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అయితే, అర్ధరాత్రి వేళ రైలుపై దాడికి గల కారణాలపై వారు సరైన వివరణ ఇవ్వడం లేదని, వారి వేషధారణ, ప్రవర్తనపై పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పక్కా ప్రణాళికతోనే రైళ్లను లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పరారైన ఆ 30 మంది గుంపు కోసం పోలీసులు రాత్రంతా వెంచర్లలో గాలింపు చర్యలు చేపట్టారు.
రాజస్థానీ వేషధారణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నందిగామ, తిమ్మాపూర్ పరిసర గ్రామాల్లోని ప్రజలు అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకూడదన్నారు రైల్వే ట్రాక్‌ల సమీపంలో అనుమానిత కదలికలు ఉంటే డయల్ 100 కి కాల్ చేయాలని కోరారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారని, ఈ ముఠా వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా లేదా వీరు దొంగతనాల కోసం ఇలా చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

