అస్సాంలో పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి

గువహటి: అస్సాంలో 18 ఏనుగులు మరణించాయి. పిడుగుపాటు వల్ల ఇవి చనిపోయి ఉంటాయని అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు. నాగాన్-కర్బి ఆంగ్లాంగ్ జిల్లా సరిహద్దులోని కొండ ప్రాంతంలో 18 ఏనుగులు మరణించి ఉండటాన్ని గురువారం గుర్తించినట్లు అస్సాం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) అమిత్ సాహే తెలిపారు. ప్రతిపాదిత కాతియాటోలి పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని కుండోలి ప్రాంతంలో ఇవి చనిపోయాయని చెప్పారు. ఒక చోట 14 ఏనుగులు, మరో చోట 4 ఏనుగుల మృతదేహాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారని, వీటి మరణానికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
మరోవైపు 18 ఏనుగులు పిడుగుపాటుకు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని అటవీ మంత్రి పరిమల్ సుక్లబైద్యా తెలిపారు. పోస్ట్మార్టం తర్వాత మాత్రమే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. తాను శుక్రవారం సంఘటన ప్రాంతాలను సందర్శిస్తానని ఆయన వెల్లడించారు.
https://t.co/4ci4j9rymJ pic.twitter.com/y67CGBwIEz
— Hemanta Kumar Nath (@hemantakrnath) May 13, 2021
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

