ముంబై : రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
అరెస్టయిన వారిలో ఇద్దరు రేవ్ పార్టీ నిర్వాహకులు కూడా ఉన్నారు. థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ చేపట్టిన లేట్ నైట్ ఆపరేషన్లో రేవ్ పార్టీ బాగోతం బయటపడింది. ఘటనా స్ధలంలో ఎల్ఎస్డీ, మరిజువన సహా పలు మత్తు పదార్ధాలు లభ్యమయ్యాయి.
రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకానికి సంబంధించి అదుపులోకి తీసుకున్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక న్యూ ఇయర్ పార్టీని భారీ స్ధాయిలో నిర్వహిస్తూ యువత డ్రగ్స్ వాడుతున్న తీరు ఈ ప్రాంతంలో కలకలం రేపింది.
Read More :
Traffic alert | న్యూఇయర్ వేడుకలు.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు