చెన్నై : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన 16 ఏండ్ల బాలుడిని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఐదేండ్లుగా వీరు ఒకే స్కూల్లో చదువుతూ సన్నిహితంగా మెలుగుతున్నారు. వీరు తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళుతున్న క్రమంలో ఈ ఏడాది జులై 25న బాలిక పుస్తకం తెచ్చుకునేందుకు నిందితుడి ఇంటికి వెళ్లింది.
ఆ సమయంలో ఒంటరిగా ఉన్న బాలుడు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆగస్ట్లోనూ తన ఇంటికి వచ్చిన సమయంలో బాధితురాలిపై బాలుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తరచూ వాంతులు చేసుకోవడంతో శనివారం ఆమె తల్లి ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు బాలిక ఐదు నెలల గర్భవతని చెప్పడంతో కుటుంబసభ్యులు కంగుతిన్నారు. తల్లితండ్రులతో కలిసి బాలిక తుడియలూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆదివారం బాలుడిని అరెస్ట్ చేశారు.