కలే లీవ్స్: నాలుగు, తరిగిన లెట్యూస్: అర కప్పు, టమాట: ఒకటి, క్యారెట్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, ఆపిల్: ఒకటి, వేయించిన పల్లీలు, వాల్నట్స్: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఆలివ్ ఆయిల్: అర కప్పు, చిల్లీఫ్లేక్స్: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు, పాలకూర తరుగు: పావు కప్పు, తురిమిన చీజ్: ఒక టేబుల్ స్పూన్, తర్బూజ గింజలు: ఒక టేబుల్ స్పూన్, కీరా ముక్కలు: పావు కప్పు, తాజా పెరుగు: పావు కప్పు, ఉప్పు: తగినంత.
ఒక గిన్నెలో ఈనెలు తీసేసిన కలే లీవ్స్‌ను ముక్కలు చేసి వేయాలి. వాటిపై అర టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు తరిగిన లెట్యూస్, టమాట, ఉల్లిపాయ ముక్కలు, ఆపిల్, కీరా, క్యారెట్, పాలకూర, చీజ్, తర్బూజ గింజలు, పల్లీలు, వాల్నట్స్ వేసి బాగా కలపాలి. మరొక గిన్నె తీసుకుని నిమ్మరసం, పెరుగు, మిరియాల పొడి, ఉప్పు, చిల్లీఫ్లేక్స్ వేసి బాగా కలిపి ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమంలో జోడించాలి. పది నిమిషాల పాటు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే ఆరోగ్యకరమైన కలే సలాడ్ సిద్ధం.
Keera Dosa Recipe | కీరా దోశ తయారీ విధానం
Paneer Jalebi Recipe | పనీర్ జిలేబీ తయారీ విధానం
Broccoli Paneer Cutlet Recipe | బ్రకోలి పనీర్ కట్లెట్ తయారీ విధానం