పెసరిజ్జా
పెసర్లను శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి. తెల్లవారాక మిక్సీలో వేసి మన ఇష్టాన్ని బట్టి బరకగా లేదా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండికి సరిపడినంత ఉప్పు వేసి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అరస్పూను ఈనోసోడా కూడా కలపాలి.
కావలసిన పదార్థాలు
పెసర్లు: ఒక కప్పు
చిల్లీ ఫ్లేక్స్: అరస్పూను
ఈనోసోడా: ఒక ప్యాకెట్
టమాటా సాస్: టేబుల్ స్పూన్
క్యాప్సికం: రెండు
ఉల్లిపాయలు: రెండు
నెయ్యి: స్పూను
చీజ్: ఒక పెద్ద ముక్క
ఆరిగానో: పావు స్పూను
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
పెసర్లను శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి. తెల్లవారాక మిక్సీలో వేసి మన ఇష్టాన్ని బట్టి బరకగా లేదా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండికి సరిపడినంత ఉప్పు వేసి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అరస్పూను ఈనోసోడా కూడా కలపాలి. గుండ్రంగా పల్చగా ఉండే మూడు నాలుగు చిన్న చిన్న ప్లేట్లను తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి పెసర పిండిని సమానంగా పరుచుకునేలా వేయాలి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. తీసిన తర్వాత దాని మీద టమాటా సాస్ పూయాలి.
ఉల్లిపాయలు, క్యాప్సికంను సన్నగా తరుక్కొని దీని మీద చల్లాలి. చీజ్ను కూడా తురిమి ఈ ఉడికించిన వాటి మీద వేయాలి. తర్వాత మైక్రోవేవ్ లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. కొద్దిసేపు ఉంచితే చీజ్ కరిగిపోతుంది. ఇవేవీ లేకపోయినా పెనం మీద మనం ఈ పెరస పిజ్జాలను కొద్దిగా నెయ్యిరాసి వేడి చేసినా చీజ్ కరుగుతుంది. చివర్లో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్లాంటివి చల్లుకుని ముక్కలుగా కట్ చేసుకుంటే… పెసర్లతో ఆరోగ్యకరంగా పిజ్జా రుచిని తలపించేలా పెసరిజ్జా లేదా పెసర పిజ్జాను
ఆరగించొచ్చు.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

