కావాల్సిన పదార్థాలు
సొరకాయ ముక్కలు: ఒక కప్పు
ఆలుగడ్డ ముక్కలు
(ఉడికించినవి): ఒక కప్పు
టమాటా ముక్కలు: ఒక కప్పు
దోసకాయ, పన్నీర్ ముక్కలు: అర కప్పు చొప్పున
క్యాప్సికం ముక్కలు, స్వీట్‌కార్న్: పావు కప్పు చొప్పున
క్యారెట్ తురుము: పావు కప్పు
కాబూల్ శనగలు
(ఉడికించినవి): పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు
నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు
పచ్చి శనగపప్పు, ఆవాలు,
జీలకర్ర, మినప్పప్పు: కొద్దిగా
జీడి పప్పులు: 10
పసుపు, ఇంగువ: చిటికెడు చొప్పున
ఎండుమిర్చి: రెండు,
కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: రెండు రెమ్మలు
గరంమసాలా: చిటికెడు
కారం, ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ఓ పాత్రలో నూనె పోసి కాగిన తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పప్పులు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. వేగిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేయాలి. ఈ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలతోపాటు మిగతా కూరగాయల ముక్కలన్నీ వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. కూర కాస్త దగ్గరకి అవుతున్నప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఓ ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే ఘుమఘుమలాడే నవరత్న కుర్మా రెడీ. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అన్నంలోకీ కలుపుకోవచ్చు.