మష్రూమ్ హుమ్మస్
ముందుగా నువ్వులను దోరగా వేయించి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శనగలను కడిగి పది గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి నీళ్లుపోసి, తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
కావలసిన పదార్థాలు
మష్రూమ్స్: ఒక కప్పు, కాబూలీ శనగలు: ఒక కప్పు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, తెల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, మిరియాల పొడి: చిటికెడు, కారం: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: పావుకప్పు.
తయారీ విధానం
ముందుగా నువ్వులను దోరగా వేయించి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శనగలను కడిగి పది గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి నీళ్లుపోసి, తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నీళ్లు వంపిన శనగల్ని మిక్సీగిన్నెలో వేసి వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, నువ్వుల మిశ్రమం, నిమ్మరసం వేసి మెత్తగా, మృదువుగా అయ్యేంతవరకు గ్రైండ్ చేయాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి తరిగిన మష్రూమ్స్, కొద్దిగా ఉప్పువేసి సన్నని మంటపై వేయించాలి.
మష్రూమ్స్ వేగుతుండగా ఒక టీస్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పు వేసి మరింత వేయించి దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో శనగల మిశ్రమం పరిచి పైనుంచి ఉడికించిన శనగలు, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, వేయించిన మష్రూమ్స్ వేసి మిరియాల పొడి, కారం చల్లాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుంటే నోరూరించే మష్రూమ్ హుమ్మస్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

