బన్నులు: 3 , బటర్: రెండు స్పూన్లు , క్యాప్సికం: ఒకటి పెద్దది , ఉల్లిపాయ: ఒకటి పెద్దది , టమాటా: రెండు , టమాటా సాస్: అయిదు టీ స్పూన్లు , చీజ్: ఆరు క్యూబులు
ఒక్కో బన్ను లేదా పావ్‌ను అడ్డంగా మూడు ముక్కలుగా కోయాలి. దానిమీద బటర్ రాయాలి. టమాటా కెచప్ కూడా పూయాలి. అలా అన్ని బన్నుల్ని సిద్ధం చేసుకున్నాక, దాని మీద ప్రతి ఒక్క బన్నుకు రెండు చొప్పున చీజ్ క్యూబుల్ని తురిమి వేయాలి. టమాటాలు, క్యాప్సికం, ఉల్లిపాయల్ని బాగా సన్నటి ముక్కలుగా తరగాలి. వాటిని కొద్ది కొద్దిగా పావ్ ముక్కల మీద చల్లాలి.
తర్వాత గ్రిల్ చేసుకోవచ్చు. లేదా ఎయిర్ ఫ్రైయర్లో మూడు నాలుగు నిమిషాలు ఉంచితే సరి! మైక్రోవోవెన్లో కూడా ఇవి తయారవుతాయి. ఇవేవీ అందుబాటులో లేకపోయినా వీటిని చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా అడ్డంగా కోసి పెట్టుకున్న బన్ను ముక్కలకు రెండు వైపులా బటర్ రాసి, పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పగానే దాని మీద కెచప్, చీజ్, కూరగాయల ముక్కలు చల్లి, మూత పెట్టి సన్నటి సెగ మీద ఉంచాలి. చీజ్ కరిగేదాకా ఉంచితే పావ్ పిజ్జా బైట్స్ సిద్ధమైపోయినట్టే!
– ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు