మష్రూమ్ హుమ్మస్
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్: ఒక కప్పు, కాబూలీ శనగలు: ఒక కప్పు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, తెల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, మిరియాల పొడి: చిటికెడు, కారం: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: పావుకప్పు.
కావలసిన పదార్థాలు
మష్రూమ్స్: ఒక కప్పు, కాబూలీ శనగలు: ఒక కప్పు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, తెల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, మిరియాల పొడి: చిటికెడు, కారం: కొద్దిగా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: పావుకప్పు.
తయారీ విధానం
ముందుగా నువ్వులను దోరగా వేయించి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శనగలను కడిగి పది గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి నీళ్లుపోసి, తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. నీళ్లు వంపిన శనగల్ని మిక్సీగిన్నెలో వేసి వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, నువ్వుల మిశ్రమం, నిమ్మరసం వేసి మెత్తగా, మృదువుగా అయ్యేంతవరకు గ్రైండ్ చేయాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి తరిగిన మష్రూమ్స్, కొద్దిగా ఉప్పువేసి సన్నని మంటపై వేయించాలి. మష్రూమ్స్ వేగుతుండగా ఒక టీస్పూన్ ఆయిల్, చిటికెడు ఉప్పు వేసి మరింత వేయించి దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో శనగల మిశ్రమం పరిచి పైనుంచి ఉడికించిన శనగలు, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, వేయించిన మష్రూమ్స్ వేసి మిరియాల పొడి, కారం చల్లాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుంటే నోరూరించే మష్రూమ్ హుమ్మస్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

