కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: పది, మైదా: అర కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్: ఒక టీస్పూన్, ఆరిగానో: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, చీజ్ తురుము: ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెన్న: టేబుల్ స్పూన్.
తయారీ విధానం
ఆలుగడ్డల తొక్కతీసి నిలువు ముక్కలుగా కోసి పది నిమిషాల పాటు నీళ్లలో నాన బెట్టాలి. మరుగుతున్న నీళ్లలో ఆ ముక్కలను రెండు నిమిషాలు ఉడికించి తీయాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి పల్చగా కలపాలి. ఆలుగడ్డ ముక్కలను మైదా మిశ్రమంలో కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయాలి. బాగా వేడయ్యాక ఆలుగడ్డ ముక్కలను విడివిడిగా వేసి దోరగా వేయించాలి. పాన్‌లో వెన్న వేడిచేసి.. తురిమిన వెల్లుల్లి వేయాలి. బాగా వేగాక ఆలు ఫ్రైస్ వేసి కలిపి పైనుంచి చీజ్ తురుము, కొత్తిమీర తురుము చల్లి ఒక నిమిషం పాటు మూత పెట్టాలి. వేడివేడి గార్లిక్ ఫ్రైస్ టమాట సాస్‌తో బాగుంటాయి.