చలికాలం వచ్చిందంటే ఒళ్లు వెచ్చదనాన్నీ, నోరు కారాన్నీ కోరుకుంటాయి. అందుకే పచ్చళ్లకు ఇప్పుడు మంచి గిరాకీ. మనం ఇష్టంగా చేసుకునే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి..
పచ్చళ్ల నిల్వకు ఉపయోగించే డబ్బాను ముందుగా వేడినీళ్లతో శుభ్రంగా కడిగి, ఎండలో ఆరబెట్టాలి. ఏమాత్రం చెమ్మలేకుండా చూసుకున్నాకే.. అందులోకి పచ్చడి మార్చాలి. గాలి చొరబడని ఎయిర్‌టైట్ కంటెయినర్లను ఎంచుకుంటే మేలు. అందులోనూ గాజు, పింగాణి, మట్టిపాత్రలలో చాలా రోజులు తాజాగా ఉంటాయి.