కావలసిన పదార్థాలు
బ్రెడ్ ైస్లెసెస్: నాలుగు, చీజ్ తురుము: అర కప్పు, సన్నగా తరిగిన చికెన్: అర కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, మిరియాల పొడి: పావు టీస్పూన్, చికెన్ మసాలా: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
పాన్‌లో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించాలి. ఎర్రగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు జతచేసి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, చికెన్ మసాలా వేసి మరో అయిదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీంట్లో చీజ్ తురుము కలపాలి. స్టవ్‌మీద పెనం పెట్టి, ఒక టీస్పూన్ నూనెవేసి, బాగా వేడయ్యాక బ్రెడ్ ముక్కల మధ్యలో చికెన్ మిశ్రమం కూరి రెండు వైపులా ఒక నిమిషం పాటు కాల్చుకుంటే వేడివేడి చికెన్ శాండ్విచ్ సిద్ధం.