అన్నం: కప్పు
బియ్యప్పిండి: పావు కప్పు
కొత్తిమీర: గుప్పెడు
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు: మూడు
కరివేపాకు: నాలుగు రెబ్బలు
బేకింగ్ సోడా: చిటికెడు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
ముందుగా అన్నాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మాష్ చేసుకోవాలి. బియ్యప్పిండిని ఇందులో కలుపుకోవాలి. కొత్తిమీర కరివేపాకులను సన్నగా తరుక్కోవాలి. అల్లం పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి ముద్దగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటితో పాటు తగినంత ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడాలని మాష్ చేసిన అన్నం మిశ్రమానికి కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేశాక ఆ పిండిని చేత్తో బాగా కలియబెట్టాలి. దీనివల్ల పునుగులు బోలుగా వస్తాయి. కలపడం పూర్తయ్యాక పొయ్యి మీద నూనె పెట్టి గుండ్రటి బంతుల్లా వచ్చేలా కడాయిలో పునుగులు వేసుకుంటే సమ్మర్లో వెరైటీ స్నాక్స్ సిద్ధమైపోతాయి.