Prabhas | బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఆ తర్వాత సలార్, కల్కి వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ది రాజా సాబ్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జరీనా.. ప్రభాస్ పనితీరు, ఆయన నడవడికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, సెట్ లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక వచ్చే జన్మలో ప్రభాస్‌కి తల్లి కావాలనే కోరిక నాకు ఉందని తెలియజేసింది. జరీనా వహాబ్ కు ప్రస్తుతం సూరజ్ పంచోలి అనే కుమారుడు ఉన్నాడు.
అతను కూడా బాలీవుడ్ నటుడు. అయితే తనకు మరో జన్మ ఉంటే మాత్రం ఆ జన్మలో సూరజ్ తో పాటు ప్రభాస్ కూడా కొడుకుగా కావాలని ఆమె కోరుకుంటుంది. ప్రభాస్ చాలా అందమైన వ్యక్తి మాత్రమే కాదు ఆయన మనసు వెన్న అంటూ కూడా జరీనా చెప్పడం విశేషం. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్- జరీనా తల్లి కొడుకులుగా కనిపిస్తారు. ఇక ఇదిలా ఉంటే సెట్లో ప్రభాస్ ఎలా ఉంటాడో తెలియజేస్తూ జరీనా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిన కూడా, షూటింగ్ చేసే సన్నివేశం లేనప్పుడు కూడా ప్రభాస్ సెట్లో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడని జరీనా వహాబ్ తెలిపింది.
విరామ సమయంలో కూడా ప్రభాస్ వానిటీ వ్యాన్ వద్దకు వెళ్లరని, సెట్ లోనే చుట్టూ తిరుగుతూ తోటి నటులతో సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది జరీనా. ఇక సెట్లో అందరిని డార్లింగ్ అని పిలుస్తూ, ఎవరికైన ఆకలిగా ఉంటే వెంటనే ఇంటి నుండి ఫుడ్ తెప్పించి స్వయంగా ఆయనే వడ్డిస్తారని కూడా తెలియజేసింది. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అని కూడా జరీనా పేర్కొంది. ఇక మారుతి దర్శకత్వం వహించిన ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2025 మే నెలలో విడుదల కానుంది.