Zainab | ఈ రోజు తెల్లవారుజామున అఖిల్- జైనబ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.గురువారం రాత్రి నుండే ఈ పెళ్లి వేడుకలు మొదలు కాగా, ఈ పెళ్లి వేడుకలకు రామ్ చరణ్, శర్వానంద్, చిరంజీవి దంపతులు హాజరయ్యారు.దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఈ పెళ్లిలో సందడి చేసినట్టు తెలుస్తుంది. ఇక రాజమౌళి తనయుడు బరాత్‌లో నానా రచ్చ చేశాడు. చాలా ప్రైవేట్ కార్యక్రమంగా అఖిల్ పెళ్లి వేడుక నిర్వహించారు. ఇక 8వ తేదీన ప్రత్యేకంగా సెలెబ్రిటీలందరికీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్ర ముఖమంత్రులు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
అయితే అఖిల్ అక్కినేనిని పెళ్లి చేసుకున్న తర్వాత జైనబ్ ఎవరు? ఆమె బాక్ గ్రౌండ్ ఏంటి? ఆస్తులు ఏమైన ఉన్నాయా అనే విషయాల గురించి చర్చ జరుపుతున్నారు. అఖిల్ భార్య జైనబ్ రవ్‌డ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు. ఆయన ఇండస్ట్రియలిస్ట్. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీలను కూడా నిర్వహిస్తుంటారు. ముంబయి బేస్డ్ ఫ్యామిలీ అయిన వీరికి ఇండియా వైడ్‌గా ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. జుల్ఫీ రవ్‌డ్జీకి ఇద్దరు సంతానం కాగా, కూతురు జైనబ్, కొడుకు జైన్. కొడుకు జైన్ రవ్‌డ్జీ జెడ్ఆర్ రెనేవేబుల్ ఎనర్జీ ప్రై.లి అనే పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరి యూనిట్ పలు ప్రాంతాలలో ఉన్నాయట.
ఇండియా వైడ్‌గా రవ్‌డ్జీ ఫ్యామిలీ బాగానే సెటిల్ అయిందట. ఇక ఆస్తుల విషయానికి వస్తే వారికి వేల కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. జుల్ఫీకి ఒక కూతురు, ఒక కొడుకు కావడంతో తన ఆస్తుల్లో సగం వాటా కూతురుకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అఖిల్‌కి కోట్ల ఆస్తులు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించగా, అదంతా కూడా చైతూ, అఖిల్లకే చెందుతుంది. అయితే తన వాటా ప్రకారం మనోడికి కోట్లలోనే ఆస్తి రానుంది. ఈ క్రమంలో టాలీవుడ్లో రిచ్చెస్ట్ హీరోల్లో ఒకరిగా అఖిల్ నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.