Veenah Rao – NTR | నందమూరి ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి నాలుగో తరం ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao)ను వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆస్కార్ విజేతలు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నందమూరి తారకరామారావు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హీరోయిన్ను కూడా పరిచయం చేసింది చిత్రబృందం.
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన.. తెలుగమ్మాయి వీణ రావు నటించబోతుంది అంటూ పరిచయం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా వీణ రావు ఫస్ట్ లుక్‌ను పంచుకున్నారు. ఇక వీణ గురించి వైవీఎస్ మాట్లాడుతూ.. కొత్తవారిని పరిచయం చేయడంలో ఈ వైవీస్ ఎప్పుడు ముందుంటాడు. తన కెరీర్లో ఎంతోమంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాను. ఇప్పుడు వీణతో పాటు ఎన్టీఆర్‌ని కూడా పరిచయం చేయబోతున్నా. వీణ ఈ సినిమాతో పాటు మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకోచ్చాడు.
అచ్చ తెలుగు అందాలరాశి మరియు కూచిపూడి నర్తకి✨️❤️
Here’s Magnificent and Beautiful First Darshan of @NewTalentRoars Production No. 1 heroine, @veenahrao 😍
She is ready to enchant everyone❤️🔥
Dynamic director @helloyvs will present her in stunning… pic.twitter.com/daCnbwzD15
— YouWe Media (@MediaYouwe) November 30, 2024