Aayirathil Oruvan Re Releasing | తమిళ నటుడు కార్తీ నటించిన క్లాసిక్ చిత్రాలలో ‘యుగానికి ఒక్కడు’ (తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’) ఒకటి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించారు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా జెరెమయ్యా ప్రధాన పాత్రల్లో నటించారు. హిస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం 2010లో విడుదలై తమిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇదే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు కార్తీ. అయితే ఇదే సినిమాను దాదాపు 15 ఏండ్ల సంవత్సరాల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మార్చి 14న ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో పాల్గోన్నాడు కార్తీ. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నన్ను తెలుగువారికి దగ్గర చేసిన చిత్రం యుగానికి ఒక్కడు. నేను ఎన్నో సినిమాలు చేసిన కూడా యుగానికి ఒక్కడు చిత్రం నా కెరీర్లో టాప్‌లో ఉంటుంది. దాదాపు 3 ఏండ్లు పగలు రాత్రి కష్టపడి చేసిన సినిమా అది. ఇది బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్. ఈ మూవీ మ్యూజిక్ పరంగా కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విభాగాలలో సత్తా చాటింది. ఈ సినిమాలో వచ్చిన ఎవర్రా మీరంతా అనే డైలాగ్ ప్రస్తుతం ఒక ట్యాగ్‌లైన్‌గా మారిపోయింది. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయడంటూ కార్తీ చెప్పుకోచ్చాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1279 AD, 14వ శతాబ్దం, మరియు 2010 మూడు వేర్వేరు కాలాల్లో జరిగే కథను చూపిస్తుంది. కథ ప్రధానంగా చోళ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. 1279లో చోళ రాజు తన రాజ్యాన్ని ప్రజలను, సంపదను పాండ్యుల నుంచి కాపాడేందుకు తన కుమారుడిని తన ప్రజలను రహస్య స్థలానికి పంపిస్తాడు. అయితే కనిపించకుండా పోయిన చోళుల జాడని వెతకడానికి కార్తీతో పాటు శాస్త్రవేత్తలు పాండ్య వంశానికి చెందినవారు ఒక ప్రమాదకరమైన ప్రయాణం చేపడతారు. అయితే వీరు వెళ్లే క్రమంలో ఎదురైన ప్రమాదాలు ఏంటి. వీరందరూ చివరికి చోళుల జాడను కనిపెడతారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
A trendsetter in visual effects, sound, and music, still fresh for today’s audience ❤️🔥
Actor @Karthi_Offl shares his excitement as #YuganikiOkkaduReRelease in theatres TOMORROW 💥💥
Book your tickets now!
— https://t.co/Y4GE3fyABQ#YuganikiOkkadu AP & TG, Karnataka, and USA… pic.twitter.com/8H6Q0N3RT0— Primeshow Entertainment (@Primeshowtweets) March 13, 2025