Yogibabu | తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యోగిబాబు (Yogi Babu). స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నాడీ టాలెంటెడ్ యాక్టర్. రీసెంట్గా జవాన్, అయాలన్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ కమెడియన్ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యోగిబాబు (Yogi Babu) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ చట్నీ – సాంబార్ (Chutney Sambar). రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానుంది.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. యోగిబాబు ఒక ఇంటికి గెస్ట్‌గా వెళ్లి అక్కడ ఇరుకోన్నట్లు తెలుస్తుంది. కామెడీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సిరీస్‌లో యోగిబాబుతో పాటు వాణీ భోజన్, షాడోస్ రవి, మైనా నందిని, దీపా శంకర్, సంయుక్తా విశ్వనాథ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.