‘త్రిముఖ’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు యోగేష్ కల్లే. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ లియోన్ కథానాయిక. అకిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై హర్ష కల్లే నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, నేర పరిశోధన నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇదని, మార్చిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంతో పాటు తాను చాణక్యం, బెజవాడ బాయ్స్ అనే మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నానని హీరో యోగేష్ కల్లే తెలిపారు. ‘త్రిముఖ’ చిత్రంలో నాజర్, ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.