తన మ్యూజిక్, సింగింగ్ టాలెంట్‌తో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు పాపులర్ మ్యూజిక్ కంపోజర్, ర్యాపర్, పాప్ సింగర్ యోయో హనీసింగ్ (Yo Yo Honey Singh). ఈ సెలబ్రిటీ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోతున్నాడన్న వార్త ఇపుడు బీటౌన్‌లో రౌండప్ చేస్తోంది. హిందీ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నాడు యోయో హనీసింగ్. ఈ ప్రాజెక్టుకు ఇల్లుమినాటి (Illuminati)టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. పాపులర్ డైరెక్టర్ మహేశ్ భట్ (Mahesh Bhatt)ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు.
గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ టీజర్ లాంఛ్ చేశారు. ఈ వీడియో హనీసింగ్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రేక్షకులకు థ్రిల్ ను కలిగించేలా వెబ్ సిరీస్ ఉండబోతుందని తాజా వీడియోతో అర్థమవుతోంది. ఈ వెబ్‌సిరీస్ నటించే యాక్టర్ల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. వినయ్ భరద్వాజ్-రాజ్ దీప్ మేయర్ సహ నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది ఈ ప్రాజెక్టు.
మీరు నా సింగింగ్, డ్యాన్స్, రైటింగ్, యాక్టింగ్‌ను చూశారు. కానీ ఈ సారి మరో స్థాయికి తీసుకెళ్తున్నా. నా తొలి ప్రాజెక్టును లెజెండరీ దర్శకుడు మహేశ్ భట్‌తో చేస్తున్నా. ఓ నిర్మాతగా ఆయనతో ఇంట్రడ్యూస్ అవుతుండటం నాకు ఆశీస్సులాంటిదని క్యాప్షన్ ఇచ్చాడు యోయో హనీసింగ్.