కేజీఎఫ్ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమ స్థాయిలో గ్లోబల్ బాక్సాఫీస్ వరకు తీసుకెళ్లాడు యశ్ (Yash). ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 2తో కూడా ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఒక్క సినిమాతోనే వరల్డ్ వైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యశ్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పాపులర్ కూల్ డ్రింక్ పెప్సీ (Pepsi)కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు యశ్. అభినందనలు పెప్సీ.. ఐ లవ్ యూ.. అంటూ పెప్సీ డ్రింక్ తాగుతున్న 8 సెకన్ల వీడియోను యశ్ ట్విటర్లో షేర్ చేశాడు. స్టైలిష్ జీన్స్-టీషర్ట్ కాంబోలో యశ్ పెప్సీ తాగుతున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ కమర్షియల్ యాడ్ ఫుల్ వీడియోను త్వరలోనే లాంఛ్ చేయనుంది పెప్సీ.
యశ్ ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో లోహిత్ ఎన్కే నిర్మిస్తున్న ఓ సినిమాలో నటించబోతున్నాడని తెలిసిందే. యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తున్నఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేజీఎఫ్ 2 తర్వాత మరే సినిమాను ప్రకటించని యశ్ మరి కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
పెప్సీ యాడ్‌లో యశ్..
Let’s Rise together! @PepsiIndia #RiseUpBaby #Ad pic.twitter.com/tOvG9pJwIH
— Yash (@TheNameIsYash) January 24, 2023