చూడకుండానే ట్రోల్ చేస్తున్నారు!
భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప కార్యాన్ని చేపట్టినప్పుడు..
భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప కార్యాన్ని చేపట్టినప్పుడు.. మనమే సినిమాను తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అగ్ర హీరో యశ్. నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘రామాయణ’ రెండు భాగాలుగా విడుదలకానున్న విషయం తెలిసిందే.
ఇందులో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. మొదటి భాగాన్ని నవంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై యశ్ స్పందించారు.
‘4000కోట్లతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఏమైనా విమర్శలు చేయొచ్చు. అవి కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అసలు సినిమా చూడకుండానే గ్రాఫిక్స్ బాగాలేవని ట్రోల్ చేయడం అర్థం లేనిది’ అని యశ్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

