ఢీ కంటెస్టెంట్ మృతి.. విషాదంలో యశ్ మాస్టర్..

బుల్లితెరపై వచ్చే ఢీ కార్యక్రమానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ షో నుంచి ఎంతోమంది కొరియోగ్రాఫర్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈరోజు ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా ఉన్న ఎంతోమందికి బీజం పడింది ఈ కార్యక్రమంలోనే. అలాంటి అలాంటి ఈ షోలో ఇప్పుడు విషాదం నెలకొంది. ఢీ కుటుంబంలో ఒక సభ్యుడు ఇప్పుడు కన్నుమూశాడు. ఈ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ దగ్గర కొన్నేళ్లుగా కంటెస్టెంట్‌గా ఉన్న కేవల్ అనారోగ్యంతో మరణించాడు.
కేవల్ కొన్నేళ్ల నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడని.. అతన్ని బతికించడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేయాలని చాలా రోజుల నుంచి అందరూ ప్రార్థిస్తున్నారు. అదే విధంగా కేవల్ బ్లడ్ గ్రూప్ చెబుతూ తనకు బ్లడ్ అవసరం ఉందని.. తనకు బ్లడ్ ఇచ్చి బతికించండి అంటూ ఎంతో మంది అభిమానులను వేడుకున్నారు. కానీ అందరి ప్రయత్నాలు వృథా అయ్యాయి. సరైన వైద్యం అందక ఆరోగ్యం విషమించడంతో కేవల్ కన్నుమూశాడు. ఇతడిని బతికించడానికి యశ్ మాస్టర్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అది ఫలించలేదు.
ఢీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి, పూర్ణ సహా ఇంకా చాలామంది సోషల్ మీడియాలో కేవల్ కి సహాయం చేయమని కోరారు.. వాళ్లకు తోచిన సహాయం కూడా చేశారు. అయితే ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బ్లడ్ క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కంటెస్టెంట్ కేవల్ తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 19న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన మాస్టర్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. “నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నాను… ఈ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నువ్వు ఉన్నట్టుగానే అనిపిస్తోంది.. మమ్మల్ని అందరిని ఒంటరి చేసి ఎంతో త్వరగా వెళ్లిపోయావ్” అంటూ యశ్ మాస్టర్ చేసిన పోస్ట్ అందరిని కంటతడి పెట్టిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..
Nandita: హీరోయిన్ తండ్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
త్రిష, కీర్తి సురేష్‌లతో సమంత వీకెండ్ మస్తీ
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

