Prabhas – Lokesh | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత కల్కి అంటూ వచ్చి మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు చూసుకుంటే.. సలార్ 2తో పాటు కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. అయితే ఇవే కాకుండా తాజాగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి పీవీసీయూలో కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే ప్రభాస్ మరో క్రేజీ దర్శకుడికి ఒకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న లోకేష్ కనగరాజ్.అవును.. ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ రజనీకాంత్‌తో కలిసి ప్రస్తుతం కూలీ అనే సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు. ఈ సినిమా అనంతరం ఖైదీ 2 తెరకెక్కించనున్నాడు.