RaghavaLawrance | మూడు దశాబ్ధాల క్రీతం ‘ముఠా మేస్త్రీ’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా తెలుగు వాళ్లకు పరిచయమయ్యాడు రాఘవలారెన్స్. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి తొలి పాటతోనే అందరితో విజిల్స్ వేయించుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్లో తిరుగులేని కొరియోగ్రాఫర్‌గా మారాడు. ఇదే క్రమంలో మెగాఫోన్ చేతబట్టి ‘మాస్’ సినిమాతో దర్శకుడి రూపం ఎత్తాడు. అక్కినేని అభిమానులకు మరిచిపోలేని హిట్టిచ్చాడు. ఆ తర్వాత హీరోగాను అవతారమెత్తి ‘స్టైల్’తో విజయ పరంపర కొనసాగించాడు. ఆ తర్వాత దర్శకుడిగా, హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు.
ఎన్ని సినిమాలు చేసిన లారెన్స్‌కు మాత్రం ముని సిరీస్ తెచ్చిన క్రేజ్ వేరు. ఈ సిరీస్‌తో దెయ్యాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. కాంచన, కాంచనా-2, కాంచనా-3 ఇలా ఈ సిరీస్‌లో తెరకెక్కిన అన్ని సినిమాలు బంపర్ హిట్లే. ఈ సిరీస్ లారెన్స్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్ తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు దెయ్యాల సినిమాలకు ఐకానిక్ అయిన చంద్రముఖి సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు టీజర్, ట్రైలర్లు గట్రా ఏమి రిలీజ్ కాకపోయిన ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ ఉంది.
అయితే అదే రోజున రామ్-బోయపాటి శ్రీనుల యాక్షన్ మూవీ కూడా రిలీజ్ కానుంది. గణేష్ పండుగపై ఈ సినిమా ఎప్పుడో ఖర్చీఫ్ వేసుకుంది. క్లాస్ ఆడియెన్స్‌ను పక్కన పెడితే మాస్లో మాత్రం ఈ సినిమాపై మాములు రేంజ్ అంచనాలు లేవు. దానికి తగ్గట్లు ఇటీవలే రిలీజైన గ్లింప్స్ కూడా అంచనాలు రెట్టింపు చేసింది. ఇక చంద్రముఖి కంటే ముందు టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై యూత్‌తో తెగ హైప్ ఉంది. ఎలాంటి అంచనాల్లేకుండానే విడులైన తొలిపార్టు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అదే క్రేజ్‌తో ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలతో లారెన్స్ పోటీ పడుతున్నారు.
డబ్బింగ్ సినిమానే కదా అని ఈ సినిమాను పక్కన పాడేయలేం. ఎందుకంటే పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లోనే ఈ సినిమా తెలుగులో పాతిక కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా సీక్వెల్ రాబోతుందంటే ఇక అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పైగా కంగానా రనౌత్, కీరవాణి వంటి బలం ఈసినిమాకు తోడుగా ఉంది. ఓపెనింగ్స్ పక్కన పెట్టేస్తే ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చిన తెలుగు సినిమాలకు మాత్రం గట్టి పోటీని ఇవ్వడం ఖాయంగా అనిపిస్తుంది.