Venu Thottempudi | ఒకప్పుడు కామెడీ సినిమాలతో వరుస హిట్స్ అందుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు వేణు తొట్టెంపూడి. స్వయంవరం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన వేణు.. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, కళ్యాణరాముడు వంటి సినిమాలతో ఆడియన్స్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. కానీ సడెన్‌గా సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. 2013లో వచ్చిన రామాచారి సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్‌డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు వేణు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు.. సినిమాలకు గ్యాప్ ఎందుకిచ్చాడో చెప్పుకొచ్చాడు.
చాలా ఏండ్ల తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సీఐ మురళిగా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తొట్టెంపూడి.. ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సినిమాలకు, నటనకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన వేణు తొట్టెంపూడి.. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు నటనకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. రామారావు ఆన్‌డ్యూటీతో పాటు ఛాయ్ బిస్కెట్ వాళ్లు నిర్మిస్తున్న పారాహుషార్ అనే సినిమాలోనూ నటిస్తున్నానని రివీల్ చేశాడు. ఇకనుంచి వరుస సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.
ఇక రామారావ్ ఆన్‌డ్యూటీ సినిమానే కమ్‌బ్యాక్‌గా ఎంచుకోవడంపై కూడా వివరణ ఇచ్చాడు. ష ఈ సినిమా డైరెక్టర్ శరత్ మండువ చాలాసార్లు ఫోన్ చేశాడు. నేను పట్టించుకోలేదు. కానీ ఒక రోజు డైరెక్టర్ శరత్ ఒక మెసేజ్ చేశాడు. ఈ సినిమాలో నటించకపోయినా ఫర్వాలేదు కానీ ఒకసారి కలుద్దామని అన్నాడు. అక్కడే పడిపోయి ఓకే చెప్పాను.. మేమిద్దరం కలిసినప్పుడు సినిమా గురించి, అందులో నా పాత్ర గురించి చెప్పాడు. మీకు నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత నా క్యారెక్టర్ గురించి రెండు మూడు సార్లు కలిసి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేశాం.. చివరకు ఓకే చెప్పాను” అని తెలిపాడు. గతంలో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ అని వేణు తొట్టెంపూడి చెప్పుకొచ్చాడు.
నిత్యానందను పెండ్లి చేసుకోవాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ram Charan | మరోసారి కాలభైరవ లాంటి పవర్ ఫుల్ పాత్రలో రామ్‌చరణ్
కెన్యా అడవుల్లో అతను ప్రపోజ్ చేశాడు.. లవ్ స్టోరీ చెప్పుకొచ్చిన ఆలియా భట్
Navya Naveli Nanda | బిగ్ బి మనమరాలు సినిమాల్లోకి ఎందుకు రావట్లేదు.. కారణమిదే