Ram Charan | మరోసారి కాలభైరవ లాంటి పవర్ ఫుల్ పాత్రలో రామ్‌చరణ్
Ram Charan New Movie | రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తండ్రికి తగ్గ తనయుడంటూ బాలీవుడ్ ప్రముఖులు చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ప్రస్తుతం ఈయన సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘#RC15’ చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన చరణ్ హేయిర్ స్టైల్ లుక్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రం తర్వాత చరణ్ ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరితో సినిమాను చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ తాజాగా మరో సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. 11వ శతాబ్దానికి చెందిన ‘రాజా సుహేల్ దేవ్’ పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. ప్రముఖ తమిళ రచయిత అమిష్ త్రిపాఠి రచించిన ‘లేజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. అయితే ఈ కథను చరణ్ రెండేళ్ల క్రీతమే ఓకే చేశాడట. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయట. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయిందట. తాజాగా అమిత్ ఈ కథను మళ్ళీ పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

