Dhanraj Vineeth | ధన్‌రాజ్ కెరీర్‌కు బిగ్ బూస్ట్ ఇవ్వనున్న ‘వరం’ వెబ్ సిరీస్!
Dhanraj Vineeth | టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో ధన్‌రాజ్ వినీత్ ఒకరు. ఇటీవలే దండోరా సినిమాలో తన నటనతో మెప్పించిన అతడు వైవిధ్యమైన పాత్రలతో ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో ధన్‌రాజ్ వినీత్ ఒకరు. ఇటీవలే దండోరా సినిమాలో తన నటనతో మెప్పించిన అతడు వైవిధ్యమైన పాత్రలతో ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా నటించిన వెబ్ సిరీస్. ‘వరం’. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందిన ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సిరీస్ విజయం, ఇందులో ఆయన పాత్ర తీరుతెన్నులు ధన్‌రాజ్ కెరీర్‌కు ఏ విధంగా పెద్ద ప్లస్ కాబోతున్నాయనేది చూద్దాం.
‘వరం’ సిరీస్‌లో ధన్‌రాజ్ హీరో రాజు (విశ్వదేవ్ రాచకొండ) స్నేహితుడిగా ‘నాని’ పాత్రలో నటించారు. సాధారణంగా సినిమాలలో హీరో ఫ్రెండ్ అనగానే కేవలం కొన్ని కామెడీ సీన్లకు మాత్రమే పరిమితం చేస్తుంటారు. కానీ ఈ సిరీస్‌లో ధన్‌రాజ్ కేవలం నవ్విచడమే కాకుండా, కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే మలుపులలో ఒక కీలకమైన భాగస్వామిగా కనిపిస్తారు. ఆయన పాత్రలోని సహజత్వం, టైమింగ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, కథలో ఇమిడిపోయేలా ఉంటాయి.
కేవలం కామెడీ జోనర్‌కే పరిమితం కాకుండా, థ్రిల్లర్ జోనర్ కథల్లోనూ తాను ఏ పాత్రనైనా అవలీలగా చేయగలనని ధన్‌రాజ్ ఈ సిరీస్ ద్వారా మరోసారి నిరూపించారు. కథానాయకుడితో సమానంగా ప్రయాణించే ఈ పాత్రలో ధన్‌రాజ్ నటనకు మంచి స్కోప్ దక్కింది. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఆయన పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా ఉండటం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. నేడు థియేటర్ల కంటే ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. జియోహాట్‌స్టార్ లాంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లో వస్తున్న ఈ సిరీస్ ద్వారా ధన్‌రాజ్ నటన దేశవ్యాప్తంగా లేదా పాన్-ఇండియా స్థాయిలో డిజిటల్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, ‘వరం’ సిరీస్ ధన్‌రాజ్ వినీత్ నటుడిగా తన పరిధిని మరింత విస్తరించుకోవడానికి, భవిష్యత్‌లో మరిన్ని బలమైన పాత్రలు ఆయనను వెతుక్కుంటూ రావడానికి ఒక చక్కని మెట్టుగా నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అక్టోబర్ 29న విడుదలయ్యే ఇంకో రెండు ఎపిసోడ్లలో ధనురాజ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

