Prabhas | ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి అరడజను సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. అందులో ఏది ఎప్పుడు విడుదలవుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఒప్పుకున్న సినిమాలకు తగ్గట్టుగానే డేట్స్ కూడా ఇస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ ఏడాది రాధే శ్యామ్ సినిమాతో వచ్చిన ప్రభాస్.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆది పురుష్ విడుదల చేయనున్నాడు. అలాగే 2023 సమ్మర్లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ విడుదల కానుంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఉండగానే మారుతితో కూడా ఒక ప్రాజెక్టు ఒప్పుకున్నాడు ప్రభాస్.
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతి లాంటి చిన్న దర్శకుడితో సినిమా చేయడంపై ఇండస్ట్రీలో చాలా రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ప్రభాస్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్టార్ హీరోతో సినిమా చేయని మారుతితో పెద్ద సినిమా చేయాలని ప్రభాస్ ఎందుకు అనుకుంటున్నాడు.. దీని వెనక ఉన్న అసలు కథ ఏంటి అంటూ చాలా రోజులుగా అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ప్రభాస్తో చేయబోయే సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు కూడా మారుతి కన్ఫర్మ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మించబోతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రభాస్ ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం తనకు తానుగా కాస్త యాక్షన్ సినిమాల నుంచి రిలీఫ్ తీసుకోవడానికే. మిర్చి సినిమా నుంచి వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్టులు చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. మొన్న రాధే శ్యామ్ క్యూట్ లవ్ స్టోరీ అయినా కూడా ఫలితం తేడా కొట్టింది. అందుకే తనను తాను కొత్తగా ఆవిష్కరించడానికి ఒక కామెడీ కథ సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభాస్. దానికి మారుతి అయితే పర్ఫెక్ట్ అని నమ్ముతున్నాడు ప్రభాస్. పైగా ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు ప్రభాస్ కేవలం 40-50 కోట్ల మధ్యలోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు వర్కవుట్ అయితే మారుతి ప్రభాస్ సినిమా టేబుల్ ప్రాఫిట్ అందుకోవడం ఖాయం. 2023 మధ్యలో ఈ సినిమా మొదలు పెట్టి 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Prabhas | ‘రాధేశ్యామ్’ ఫలితంపై ప్రభాస్ ఏమన్నాడంటే..?”
“KGF 2 హ్యాంగోవర్.. ప్రభాస్ సలార్ సినిమాపై ఒక్కసారిగా పెరిగిపోయిన అంచనాలు..”
Prabhas | ఈ 2 సినిమాలే ఫస్ట్ అంటున్న ప్రభాస్..ఇంతకీ టార్గెట్ ఏంటో..?”
Prabhas | ప్రభాస్-మారుతీ సినిమా ప్రారంభమయ్యేది అప్పుడేనట?”