Prabhas | ప్రభాస్-మారుతీ సినిమా ప్రారంభమయ్యేది అప్పుడేనట?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామెడీ చిత్రం చెయ్యబోతున్నట్లు గతం నుంచే వార్తలు వస్తున్నాయి.
Prabhas-Maruthi Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత ప్రభాస్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం అనే ఆశతో వచ్చిన ప్రేక్షకులకు ఈ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్‌కు భిన్నంగా లవర్‌బాయ్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామెడీ చిత్రం చెయ్యబోతున్నట్లు గతం నుంచే వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన లాంఛనింగ్ కార్యక్రమాలు ఏప్రిల్ 10న గ్రాండ్‌గా జరుగనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద బంగ్లా సెటప్ పూర్తయిపోయిందని టాక్. కాగా దీనికి సుమారు 5కోట్ల వరకు మేకర్స్ ఖర్చుచేశారట. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్‌తో జోడీ కట్టనున్నారు. అనుష్క, రాశీఖన్నా, మాళవిక మోహన్‌లు నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్- K’ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ స్క్రిప్ట్ దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

