Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakoor) ఈ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. శనివారం ఈ మూవీ నుంచి మేకర్స్ అందమైన రొమాంటిక్ అమ్మాడి సాంగ్‌ను విడుదల చేశారు.
అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వెళ్లిన మూవీ టీమ్‌తో.. అక్కడున్న స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. ఇక ఇక హీరో నాని కూడా స్టూడెంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నిస్తూ.. నాని అన్న మీరు చిన్న దర్శకులతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు. పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నించారు. దానికి నాని సమాధానమిస్తూ.. ”మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాలు చూసేందుకు వెయిట్ చేయవచ్చు. కానీ నా కోసమే ఎందుకు థియేటర్‌కు వస్తున్నారు. మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మనం వెళ్లిపోతున్నాం. అలాగే మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు. నేనూ అంతే అని నాని అన్నారు”. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nani’s response when a fan asked why he’s working mostly with debutant directors but not with star directors at the #HiNanna third song launch event. pic.twitter.com/SfgGtsUhrg
— Aakashavaani (@TheAakashavaani) November 4, 2023
మరోవైపు ప్రాణం అల్లాడి పొద అమ్మాడి’ సాంగ్‌లో నాని, మృణాల్‌ల పెళ్లి అయ్యినట్లు కనిపిస్తుంది. చూస్తుంటే ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అందమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి.