Sarath Babu | శరత్‌బాబు అంత్యక్రియలు నిర్వహించేది ఎవరంటే?
Actor Sarath Babu Last Rites | సీనియర్ నటుడు శరత్‌బాబు మరణంతో టాలీవుడ్ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. గతకొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్‌బాబు గచ్చిబౌళిలోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచాడు.
Actor Sarath Babu Last Rites | సీనియర్ నటుడు శరత్‌బాబు మరణంతో టాలీవుడ్ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. గతకొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్‌బాబు గచ్చిబౌళిలోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా శరత్‌బాబు అంత్యక్రియలు చెన్నైలో జరుగనున్నాయి. అయితే శరత్‌బాబుకు రెండు పెళ్లిళ్లు అయిన వారసులు లేరు. దాంతో ఆయనకు తలకొరివి పెట్టేది ఎవరు అనే విషయం అందరిలోనూ ఉంది.
ఇక శరత్‌బాబు కెరీర్ ప్రారంభంలోనే అప్పటికే సీనియర్ నటిగా కొనసాగుతున్న రమాప్రభను పెళ్లిచేసుకున్నాడు. కాగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 14ఏళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి సంతానం లేదు. ఆ తర్వాత రెండేళ్లకే తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా మనస్పర్థలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. కాగా వీరికి కూడా సంతానం కలుగలేదు. దాంతో వారసులు లేకుండా శరత్‌బాబుకు తలకొరివి పెట్టేది ఎవరూ అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
కాగా శరత్‌బాబుది చాలా పెద్ద కుటుంబం. ఆయనుకు ఏడుగురు అన్నదమ్ముల్లు, ఆరుగురు అక్కాచెల్లెల్లు. కాగా వారి పిల్లలే సుమారుగా 25మంది ఉన్నారు. ఇక అందులో ఎవరో ఒకరితో శరత్‌బాబుకు తలకొరివి పెట్టించనున్నట్లు తెలుస్తుంది. ఇక శరత్‌బాబు భౌతిక కాయాన్ని చెన్నైలోని ఆయన స్వగృహంలోకి సోమవారం తరలించారు. ఆయన అంత్యక్రియలు కాసేపట్లో మొదలు కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

