Karthikeya 2 | రిలీజ్‌కు ముందు ట్విస్టులు..కార్తికేయ-2 వివాదానికి కారణం ఎవరు..?
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 (Karthikeya 2)..విడుదలై ఘన విజయం సాధించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వసూళ్లతో దూసుకుపోతుంది. ముఖ్యంగా విడుదల తేది విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని సినిమా యూనిట్ సభ్యులే పలు ఇంటర్వ్యూల్లో పరోక్షంగా చెప్పారు.
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 (Karthikeya 2)..విడుదలై ఘన విజయం సాధించి..బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వసూళ్లతో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు సినిమాల్లో వున్న ట్విస్ట్‌లను మరిపించేలా తమ విడుదలకు ముందు ట్విస్ట్‌లు జరిగాయని, ముఖ్యంగా విడుదల తేది విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని సినిమా యూనిట్ సభ్యులే పలు ఇంటర్వ్యూల్లో పరోక్షంగా చెప్పారు.
హీరో నిఖిల్ (Nikhil Siddharth) కూడా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎటువంటి నేపథ్యం లేకపోవడంతో.. తమ సినిమా విడుదల విషయంలో వెనక్కి వెళ్లాలని కొంత మంది ఒత్తిడి చేశారని బాహాటంగానే చెప్పాడు..ఇక ఆ సమయంలో విడుదల సినిమాలను అంచనా వేసుకోని నిఖిల్ మాటలను కలిపి ఆ నిర్మాత ఎవరో ఓ అంచనాతో సోషల్‌మీడియాలో ప్రచారాలు ఊపందుకున్నాయి.
సినిమా అనేది వ్యాపారం..ఇక్కడ మన తమ అనేది ఏమీ వుండదు..సినిమాలో కంటెంట్ వుంటే ఎవరూ ఆపలేరు..ఒకరి సినిమాను ఒకరు తొక్కేయడం జరగదు. సినిమా సక్సెస్ విషయంలో అన్ని కలిసిరావాలి. విడుదల తేదీతో పాటు ఆ సమయంలో ప్రకృతి కూడా సహకరించాలి. ఈ విషయంలో కార్తికేయ-2కు అన్ని కలిసొచ్చాయి. సినిమాలో వున్న కృష్ణతత్వంతో పాటు న్యూకంటెంట్ వుంటే ప్రేక్షకుల నుండి వచ్చే సపోర్ట్ ఇలా అన్ని కలిసి కార్తీకేయ-2ను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
అయితే ఈ రోజు జరిగిన సక్సెస్‌మీట్‌లో ఈ సినిమా విషయంలో దిల్‌రాజు (Dil Raju) తాను ఈ సినిమాను అడ్డుకోలేదని..మీడియానే అత్యుత్సాహం చూపి తన మీద రూమర్స్ క్రియేట్ చేసిందని ఆరోపించాడు. అయితే ఇందులో కార్తికేయ-2 యూనిట్ ఇచ్చిన లీకేజీలు కూడా వున్నాయని అంటున్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఆఫ్ దిరికార్డ్ పేరిట యూనిట్ సభ్యులే మీడియాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారని అంటున్నారు మీడియా మిత్రులు.
Read Also :Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్‌కు చిరు రెడీ..!
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

