Bigg boss 5 telugu | మరో 3 వారాల్లో బిగ్ బాస్ 5 తెలుగు ముగుస్తుంది. ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే ఉన్నారు. వాళ్లలో నుంచి మరో ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ వారం ప్రియాంక సింగ్ ఓటింగ్ చాలా వీక్‌గా ఉంది. అందరికంటే తక్కువ ఓట్లు ఆమెకే పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత వారం కూడా ఇదే వార్తలు వచ్చాయి. కానీ ఊహించని విధంగా యాంకర్ రవి బయటకి వచ్చాడు. కావాలని పింకీని కాపాడుతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
దాని వెనుక ఎలాంటి వ్యూహం ఉందనేది కేవలం బిగ్ బాస్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. ఈ వారం కూడా అలాంటి విచిత్రం జరిగితే పింకీ సేవ్ అవుతుంది. అప్పుడు కాజల్ డేంజర్ జోన్లోకి వెళుతుంది. ఈ వారం నామినేషన్స్‌లో మానస్, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక ఉన్నారు. ఇందులో శ్రీరామ్, సిరి, మానస్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఎటొచ్చి ఈవారం ఎలిమినేషన్ పింకీ, కాజల్ మధ్య జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. టిక్కెట్ టూ ఫినాలే అంటూ నేరుగా ఫైనల్లో చోటు సంపాదించుకునే టాస్క్ ఇది.
ఈ టాస్క్‌లో నుంచి ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, కాజల్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సన్నీ, సిరి, మానస్, శ్రీరామ్ పోటీలో ఉన్నారు. వీళ్లలో నుంచి ఎవరు నేరుగా ఫినాలేకు ఎంపికవుతారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీనిపై కూడా క్లారిటీ వచ్చేసింది. సిరి ఈ టాస్క్‌లో గెలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి ఒక లేడీ కంటెస్టెంట్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించినట్లు అవుతుంది. సన్నీ చివరివరకు పోటీలో నిలబడిన ఈ టాస్క్ ఫైనల్లో మాత్రం సిరి గెలిచినట్టు తెలుస్తోంది. ఈ వారం ఆమె ఎలిమినేట్ కాకపోతే టికెట్ టు ఫినాలే ఈ వీకెండ్ నాగార్జున ప్రకటించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Deepthi : షణ్ముఖ్‌కి కాకుండా మరో వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న దీప్తి.. అంతా షాక్!
Shilpa Chowdary: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో..!
PRIYANKA SINGH: ట్రాన్స్‌జెండర్ అంటే అడుక్కునే వారు గుర్తొస్తారు.. తమన్నా స్టన్నింగ్ కామెంట్స్
ticket to finale : టికెట్ టూ ఫినాలే రేసు నుండి కాజల్, ప్రియాంక ఔట్
Shanmukh: సిరి కోసం రంగంలోకి దిగిన షణ్ముఖ్..!