టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌కి స్కిల్ ఛాలెంజ్ టాస్క్ ఇచ్చారు . ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు.
మొదటిగా శ్రీరామ్ తరుపున సన్నీ.. సిరి తరుపున షణ్ముఖ్ బరిలో నిలవగా.. సన్నీ విన్నర్ అయ్యాడు. ఆ తరువాత కాజల్-ప్రియాంకలు పోటీపడగా.. చివర్లో షణ్ముఖ్, సన్నీ, మానస్లు పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్‌లో కూడా మానస్.. తక్కువ టైంలో వాటర్ పోసి బాల్స్ టబ్‌లో పడేట్టు చేయడంతో విజేత అయ్యాడు. అయితే అందరికంటే తక్కువ వేసిన షణ్ముఖ్ ఏడోస్థానానికి పరిమితం అయ్యాడు.
ఈ టాస్క్‌లో షణ్ముఖ్ ఏడో స్థానంలో నిలవగా, సన్నీ ఆరోస్థానం, కాజల్ ఐదో స్థానం, ప్రియాంక నాలుగో స్థానం, సిరి మూడోస్థానం, శ్రీరామ్ రెండో స్థానం, మానస్ మొదటి స్థానంలో నిలిచారు. అయితే ఈ టికెట్ టు ఫినాలే మూడు టాస్క్‌లు కంప్లీట్ అయ్యేసరికి చివరి స్థానంలో నిలిచిన ముగ్గురు కంటెస్టెంట్లు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లే అర్హతను కోల్పోతారని బిగ్ బాస్ చెప్పడంతో.. తక్కువ పాయింట్స్ సాధించిన కాజల్ (8), ప్రియాంక(8)లు టికెట్ టు ఫినాలే నుంచి తప్పుకున్నారు.