బిగ్ బాస్ షోతో షణ్ముఖ్- దీప్తి సునయన జంటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. షణ్ముఖ్ హౌజ్‌లో ఉండి గేమ్ ఆడుతుంటే, దీప్తి బయట నుండి తన ప్రియుడికి మరిన్ని ఓట్లు పడేలా చేస్తుంది. గత వారం వీకెండ్లో బిగ్ బాస్ షో స్టేజ్‌పై దీప్తి సునయన ఎంత సందడి చేసిందో మనం చూశాం. షణ్ణుతో మనసు విప్పి మాట్లాడిన దీప్తి.. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని సూచించింది.
షణ్ముఖ్ బిగ్ బాస్‌కి వెళ్లినప్పటి నుండి అతని కోసం ఎంతో కష్టపడుతూ ఉన్న దీప్తి తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి తన సపోర్ట్ అందిస్తుంది. అతను తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదులేండి. ప్రస్తుతం తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్-5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ్ అనే కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్ధతు ప్రకటించింది. అతడికి ఓట్లు వేయాలంటూ తన ఫాలోవర్లను సైతం కోరింది.
అతడకి తాను వేసిన ఓట్స్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీప్తి షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, కొద్ది రోజుల క్రితం జరిగిన బీబీ హోటల్ టాస్క్‌లో షణ్ను, సన్నీలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై షణ్నూ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన కౌంటర్ రిప్లై ఇచ్చింది. నువ్వు బెస్ట్ అనుకోం తప్పులేదు. కానీ మిగతా అందరిని ఎందుకు అలా చూస్తున్నారు?నీలా ఇంకొకరు ఉండలేరు. ఇంకొకరిలా నువ్వు ఉండలేవు. మీరు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా?’ అంటూ సన్నీని ఏకిపారేసింది.