తమన్నా అంటే మనందరికి ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ తమన్నా. కాని ట్రాన్స్‌జెండర్‌గా బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొని సందడి చేసిన తమన్నా సింహాద్రి గురించి ఇప్పుడు మనం మాట్లాడేది. రవికృష్ణతో గొడవలు పెట్టుకుని బాగా ఫేమస్ అయింది.మూడు వారాలకే హౌజ్ నుండి బయటకు వచ్చిన తమన్నా చాలా రోజుల తర్వాత వార్తలలోకి ఎక్కింది. ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ట్రాన్స్‌జెండర్‌గా ఉన్న ప్రియాంకకు తన మద్దతు ప్రకటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసిన ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతున్నాను. ట్రాన్స్‌జెండర్ అనగానే చాలామందికి రోడ్ల మీద అడుక్కునేవారే గుర్తొస్తారు. కానీ అయినవాళ్లందరికీ దూరమై, ఎన్నో కష్టాలు పడే చాలామంది గౌరవంగా బతకాలని ముందుకు వస్తున్నారు. వాళ్లలో ప్రియాంక సింగ్ ఒకరు. ఆమె బిగ్‌బాస్‌కు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ప్రియాంక 10 వారాలపైన ఉండడం గొప్ప విషయం. ఫినాలేలో అడుగుపెట్టి టైటిల్ గెలిస్తే అది చరిత్రే అవుతుందని తమన్నా సింహాద్రి వీడియోలో పేర్కొన్నారు.