A22 x A6 | అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌కి 20 ఏండ్ల కుర్రాడు మ్యూజిక్
Sai Abhyankkar | ‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌గా పాకింది. దాంతో ఆయన తాజా సినిమాకోసం అభిమానులేకాక, సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sai Abhyankkar | ‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌గా పాకింది. దాంతో ఆయన తాజా సినిమాకోసం అభిమానులేకాక, సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఆయన బర్త్‌డే కానుకగా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ చేయబోతుండగా.. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్‌పై చిత్రీకరించిన ఓ వీడియోను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ‘A22 x A6’గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం 20 ఏండ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు. తమిళంలో తన పాటలతో పాప్ వైబ్ తీసుకువచ్చిన సాయి అభయంకర్ (Sai Abhyankkar).
గతేడాది యూట్యూబ్‌లో వైరల్ అయిన ఇండియన్ పాటలలో తమిళం నుంచి వచ్చిన ‘ కచ్చిసేరా’ , ‘ ఆసై కూడా’ పాటలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఒక్కొక్కటి దాదాపు 200 మిలియన్ కంటే ఎక్కువగా వ్యూస్‌ని సాధించాయి. అయితే ఈ పాటలని కంపోజ్ చేయడంతో పాటు అందులో నటించాడు సాయి అభయంకర్ (Sai Abhyankkar). తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన అలరించిన సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి. చిన్నతనం నుంచే సంగీతంపైన ఇంట్రెస్ట్ పెంచుకున్న సాయి ప్రస్తుతం తన మ్యూజిక్‌తో అదరగొడుతున్నాడు. గత ఏడాది తమిళంలో వచ్చిన ‘బెంజ్’ అనే సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం పొందాడు. అంతేకాకుండా, మరో రెండు మూడు ప్రాజెక్టులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కే సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అయితే ఒక 20 ఏండ్ల కుర్రాడిని అల్లు అర్జున్ సినిమాకి సంగీత దర్శకుడిగా పెట్టడమంటే సాహసం చేస్తున్నారు మేకర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

