Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల కింగ్ సినిమా షూటింగ్లో గాయపడి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా షూటింగ్ లేకా ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతున్న షారుఖ్ తాజాగా అభిమానులతో ముచ్చటించడానికి ఎక్స్ వేదికగా ఆస్క్షారుఖ్ అనే లైవ్ సెషన్ పెట్టాడు. ఇందులో షారుఖ్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి అప్డేట్లను పంచుకున్నాడు.
ఒక అభిమాని షారుఖ్‌ని అడుగుతూ.. సర్ మీ కొడుకు ఆర్యన్‌ని హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తారు? అతడిని సూపర్‌హీరోగా చూడాలని ఉంది అంటూ అడుగగా.. షారుఖ్ సమాధానమిస్తూ.. అతడు దర్శకుడు అవ్వాలి అనుకుంటున్నాడు. ‘బాస్టర్డ్స్ఆఫ్ బాలీవుడ్’ (Ba***ds of Bollywood)తో అతడు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్యన్‌ని దర్శకుడిగా చూసినప్పుడు మీ ప్రేమను పంచండి.. ఇప్పుడే నా ఇంట్లో కాంపీటిషన్ అవసరం లేదు అంటూ షారుఖ్ నవ్వులు పూయించాడు.
మరో అభిమాని అడుగుతూ.. జిమ్‌లో గాయపడటం మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతుందా లేక ట్విట్టర్ లో ట్రోల్స్ చదవడం ఎక్కువ బాధ పెడుతుందా? అంటూ అడుగగా.. షారుఖ్ సమాధానమిస్తూ.. డంబెల్స్, యాక్షన్ నా ఎముకలు విరగ్గొట్టగలవు… కానీ విమర్శలు నన్ను బాధపెట్టలేవు. ఎందుకంటే నేను నా మనసులోని సంగీతాన్ని వినడంలో చాలా బిజీగా ఉన్నాను. అంటూ షారుఖ్ తెలిపాడు.
ఇటీవల నేషనల్ అవార్డు రావడంపై మీ ఫీలింగ్ ఎలా ఉందని మరో అభిమాని అడుగగా.. షారుఖ్ సమాధానమిస్తూ.. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ దేశానికి రాజులా భావిస్తున్నాను. అవార్డు వచ్చాక ఎంతో గౌరవం పెరిగింది., అలాగే మరింత కష్టపడి, రాణించాలనే బాధ్యత కూడా పెరిగిందంటూ షారుఖ్ చెప్పుకోచ్చాడు.