RRR Movie | రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీలో ఎప్పుడు రాబోతుంది..?
RRR in OTT | ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే శాటిలైట్ రైట్స్ కోసం ఎంత డిమాండ్ ఉండేదో.. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం అంతే డిమాండ్ ఏర్పడింది. థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత తమ సినిమాను నిర్మాతలు ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు కూడా పెద్ద సినిమాలకు భారీ అమౌంట్ ఇచ్చి హక్కులు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ ఓటీటీ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది.
జీ స్టూడియోస్ ఇప్పుడు తెలుగులోనూ భారీ సినిమాలను కొనుగోలు చేస్తుంది. మిగిలిన ఓటీటీ సంస్థలతో పోటీని తట్టుకునేందుకు ఏకంగా పాన్ ఇండియా సినిమాల హక్కులను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాను కొనుగోలు చేసింది. అలాగే RRR నాన్ థియేట్రికల్ హక్కులను 300 కోట్లు చెల్లించి జీ5 దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. థియేటర్లలో వచ్చిన కనీసం 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అంటే జూన్ రెండో వారంలో ట్రిపుల్ ఆర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, స్పానిష్ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రాధే శ్యామ్, RRR.. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు డిజిటల్ హక్కులు జీ స్టూడియోస్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలతో కచ్చితంగా తమ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థలో భారీ సినిమాలు ఉన్న భారీ విజయాలు లేవు. ఇలాంటి సమయంలో వరుసగా పెద్ద సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నారు.
Read More :
జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి ఆయనే..!”
“RRR entry scenes | గూస్ బంప్స్ తెప్పించేలా ఆర్ఆర్ఆర్ ఎంట్రీ సీన్..!”
“SS Rajamouli | ఆ భయమే నన్ను ఉత్తమంగా పనిచేయిస్తుంది: ఎస్ ఎస్ రాజమౌళి”
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

