పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయం త్వరలోనే రాబోతుంది. మెగా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయేందుకు ముస్తాబవుతోంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జక్కన్న గల్ఫ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన సినిమాల సక్సెస్ గురించి రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ..ఓటమి భయమే తనను పెద్ద కల కనేలా చేస్తుందన్నాడు.
నేను సినిమా తీస్తున్నపుడు ఇది నా ముందటి సినిమాను మించిపోవాలనుకుంటా. అందువల్ల మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు చాలా భయమేస్తుంది. ఆ భయమే నన్ను ఉత్తమంగా పనిచేసేలా చేస్తుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (RRR pre release event)ను భారీ స్థాయిలో త్వరలోనే బెంగళూరులో నిర్వహించనున్నారు మేకర్స్. ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..జూనియర్ ఎన్టీఆర్ కొమ్రంభీం రోల్ చేస్తున్నాడు. అలియాభట్ సీత పాత్రలో కనిపించనుండగా..ఒలివియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. సముద్రఖని, అజయ్ దేవ్గన్, శ్రియా కీ రోల్స్ పోషిస్తున్నారు.