పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli), ఎన్టీఆర్, రాంచరణ్ అండ్ టీం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (RRR Promotions)తో బిజీగా ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ ఎంట్రీ సీన్ ఎలా ఉండబోతుందన్న న్యూస్ అందరినీ ఎక్జయిటింగ్‌కు గురిచేస్తోంది. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్, పోలీస్ అవతార్‌లో రాంచరణ్ ఎంట్రీతో ఆర్ఆర్ఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశం ఉండనుందట. ఈ రెండు సీన్లు చాలా అద్బుతంగా విజువల్ వండర్‌గా ఉండబోతున్నాయని సమాచారం. తారక్, చరణ్ అభిమానులు పండుగ చేసుకునేలా ట్రీట్ ఉండబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సోమవారం (మార్చి 14న) ఎత్తర జెండా పాటను విడుదల చేస్తున్నట్టు జక్కన్న టీం ప్రకటించింది. మార్చి 18,19వ తేదీల్లో దుబాయ్, బెంగళూరు ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
ఆర్ఆర్ఆర్(RRR)లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) నటిస్తుండగా..కొమ్రం భీం రోల్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. హాలీవుడ్ భామ ఒలివియో మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండగా…అజయ్ దేవ్గన్, సముద్రఖని, శ్రియా శరణ్ కీ రోల్స్ చేస్తున్నారు.