Samantha |సమంత హాట్ ఫొటోషూట్స్..ఇంతకీ ప్లాన్ ఏంటో..?
ఈ మధ్య టాలీవుడ్ (Tollywood) భామ అక్కినేని సమంత (Samantha) పేరు మరోలా వినిపిస్తుంది. హాట్ ఫోటోషూట్స్ (Louis Vuitton outfit) చేసుకుంటూ మతులు చెడగొడుతుంది సమంత.

ఈ మధ్య టాలీవుడ్ (Tollywood) భామ అక్కినేని సమంత (Samantha) పేరు మరోలా వినిపిస్తుంది. ఆమె అక్కినేని కోడలుగా ఉండకూడదని నిర్ణయించుకుందని..విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే బయట ఎంత ప్రచారం జరిగినా కూడా తన పని తాను చేసుకుంటూనే ఉంది సామ్. తమ గురించి ఎవరేం మాట్లాడుకున్నా కూడా పట్టించుకోకూడదని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినట్లుంది. అందుకే తన పనులతో బిజీ అయిపోయింది అక్కినేని కోడలు. పైగా ఈ వార్తలు వచ్చిన తర్వాత కూడా హాట్ ఫోటోషూట్స్ (Louis Vuitton outfit) చేసుకుంటూ మతులు చెడగొడుతుంది సమంత. తాజాగా ఈమె అదిరిపోయే నడుము అందాలు చూపిస్తూ ఫోటోషూట్ విడుదల చేసింది. ఇది చూసిన తర్వాత ఏం జరిగినా కూడా తగ్గేదే లే అంటుందంటూ సమంతపై అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

లేకపోతే మరేంటి.. కావాల్సినంత ఇమేజ్ ఉంది.. కూర్చున్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు నిర్మాతలు. ఇది లేదు అనడానికి లేనంత ఆస్తులు ఉన్నాయి.. అయినా కూడా ఇంకేదో కావాలి అంటుంది సమంత అక్కినేని. అదే ఆరోగ్యం.. అందమైన ఫిజిక్. ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదంటుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత హీరోయిన్లను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు అనే నానుడికి బ్రేక్ చెప్పి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది సమంత.

ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. జాను తర్వాత ఎందుకో తెలియదు కానీ సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. వాటి స్థానంలో వెబ్ సిరీస్, డిజిటల్ మీడియాకు చేరువవుతుంది. ఈ మధ్యే అల్లు అరవింద్ ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షో కూడా చేసింది. అలాగే ఫిజిక్ పై మాత్రం అదే శ్రద్ధ తీసుకుంటుంది సమంత. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్లో ఫిగర్ మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు. కానీ సమంత చేసి చూపిస్తుంది. సినిమాలున్నా లేకపోయినా తన ఫిజిక్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదంటుంది అక్కినేని కోడలు. అందుకే ఇప్పటికీ గంటలకు గంటలు జిమ్ లో చెమటలు కక్కుతుంది.
తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోషూట్ చూసిన తర్వాత సమంత ఏ స్థాయిలో వర్కవుట్స్ చేస్తుందో అర్థమైపోతుంది. ఇది చూసిన తర్వాత సమంత ఇంతకీ ఏం చెప్పాలనుకుంటుంది.. ఎందుకు ఇంతగా రెచ్చిపోతుంది అంటూ అనుమానాలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఇంకా అందంగా మారిపోయింది సమంత. లాక్ డౌన్ మొత్తం జిమ్‌లోనే ఎక్కువ సమయం గడిపింది సమంత. అందుకే అదిరిపోయే ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది. దాన్ని చూపించుకోవడానికి కూడా ఏ మాత్రం మొహమాటపడటం లేదు సమంత.
ఇవి కూడా చదవండి..
Sehwag: పవన్ డైలాగ్‌తో సెహ్వాగ్ క్రేజీ వీడియో వైరల్
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

