క్షణం, గూడఛారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు అడివిశేష్ (Adivi Sesh). ఇటీవలే G2 (గూడఛారి 2) కూడా ప్రకటించేశాడు. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉండే అడివిశేష్ ఇప్పుడు వ్యక్తిగత పనులతో బిజీ అయిపోయాడు. అడివిశేష్ ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ టాలెంటెడ్ హీరో ఇంట పెళ్లి సందడి మొదలైంది.
ఇంతకీ ఎవరి పెళ్లనే కదా మీ డౌటు. జనవరి 26న అడివిశేష్ సోదరి (Shirley Marriage) షిర్లే పెళ్లి వేడుక జరుగనుంది. అడివిశేష్ చెల్లి, బావతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను నెట్టింట షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. స్నేహితులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరుగనుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగనున్నట్టు తెలియజేశాడు అడివిశేష్. అడివిశేష్ బావ పేరు డేవిన్ గుడ్రిచ్. అతనిది అమెరికన్ ఫ్యామిలీ. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఓ రిసార్ట్లో జరిగే ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు డేవిన్ గుడ్రిచ్ కుటుంబసభ్యులు ఫ్లోరిడా నుంచి రానున్నారు. షిర్లేతో అడివిశేష్, వెన్నెల కిశోర్ కలిసిన దిగిన ఫొటో కూడా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.