Mangalavaaram | ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ మూవీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటిస్తోంది. మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెంచేస్తున్నాయి.
మంగళవారం నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది టీం. ఈ సినిమాతో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతిరెడ్డి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. సురేశ్ వర్మ, స్వాతిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా విశేషాలు వారి మాటల్లోనే..
స్వాతిరెడ్డి చిట్‌చాట్..
మీ ఫ్యామిలీ 30 ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇంత గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇవ్వడానికి కారణం..?
ఏదైనా ఆలస్యం జరిగిందా..? అని అనుకోను. నేను మూవీ బఫ్‌ను. ఫిల్మ్ మేకింగ్ పట్ల నాకు క్యూరియాసిటీ ఉంటుంది. మా టీవీలో జాయిన్ అయినప్పుడు సురేశ్ వర్మ నుంచి చాలా నేర్చుకున్నా. నేను ఒక సినిమా నిర్మించాలనుకుంటున్నట్టు సురేశ్ వర్మతో చెప్పాను. సినిమాను ఇద్దరం కలిసి నిర్మించాలనుకున్నాం. మంగళవారం అవుట్ పుట్ అంచనాలను మించి ఉంటుంది.
అల్లు అర్జున్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది..?
మా టీవీలో జాయిన్ కాకముందు నుంచే అల్లు అర్జున్, నేను స్నేహితులం. మా కుటుంబాల మధ్య చక్కటి అనుబంధం ఉంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రావాలని మా హెచ్‌వోడీ నాకు షరతు పెట్టారు. అల్లు అరవింద్ అంకుల్‌ను అడిగా.. బన్నీ ఈవెంట్‌కు వచ్చాడు. అప్పటి నుంచి స్నేహం మొదలైంది. అంతేకాదు స్నేహారెడ్డి, నేను కూడా మంచి స్నేహితులం. నా భర్త ప్రణవ్, స్నేహ స్కూల్ మేట్స్.
కమర్షియల్ సినిమా, లవ్‌స్టోరీ కన్నా డార్క్ థ్రిల్లర్ తీయడం చాలా రిస్క్.. దీనిపై మీ అభిప్రాయమేంటి..?
ఈ జోనర్లో సినిమా చేస్తామని మేం అనుకోలేదు. నేను కామెడీ సినిమాలు చూస్తుంటా. థ్రిల్లర్స్ అంతగా చూడను. అజయ్ భూపతి స్కిప్ట్ వివరించినప్పుడు ఒకే చేస్తే బాగుంటుందనిపించింది. మంగళవారం ఇచ్చే సందేశం నాకు చాలా నచ్చింది. సినిమాలో మ్యూజిక్, ఎమోషన్స్, సందేశం.. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.
సురేశ్ శర్మ చిట్ చాట్..
మంగళవారమే ఎందుకు..? మీకు ఇంతకుముందు ఇతర స్క్రిప్టులేమైనా వచ్చాయా..?
మంగళవారం సినిమాకు ముందు రెండు లేదా మూడు కథలు విన్నాం. ఆర్ఎక్స్ 100 టైంలో అజయ్ భూపతి నాకు మంగళవారం కథ చెప్పారు. నేను చాలా ఎక్జయిట్ అయ్యా. అజయ్ హోంబ్యానర్లో సినిమా చేయాలనుకున్నాడు. కొందరు నిర్మాతల పేర్లు సూచించా. అప్పుడు కథ వినమని స్వాతికి చెప్పా. అంచనాలకు మించి మంగళవారం ఔట్పుట్ వచ్చింది.
చిరంజీవి ట్రైలర్ లాంఛ్ చేసి మీ గురించి గొప్పగా చెప్పారు కదా.. ఎలా ఫీలవుతున్నారు..?
చిరంజీవికి నేను వీరాభిమానిని. నా చిన్నతనంలో ఆయన్ను దగ్గరగా చూడాలని కల ఉండేది. ఇప్పుడు చిరంజీవి స్వయంగా మా సినిమా గురించి ట్వీట్ చేశారు. ఈ క్షణాలను నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను.
ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించడం కొనసాగిస్తారా..?
జయాపజయాలను పక్కన పెట్టి వర్కింగ్ ప్రాసెస్‌ను ఎలా ఆస్వాదించాలో మా బాస్, స్వాతి నాన్న నిమ్మగడ్డ ప్రసాద్ మాకు నేర్పించారు. మంగళవారం సినిమాకు పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాం. మా టీవీలో కూడా ఎంజాయ్ చేశాం. ఫలితాలతో సంబంధం లేకుండా మా ప్రయత్నాలు దోషరహితంగా ఉండేలా చూస్తామన్నారు.