75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (75th Cannes Film Festival) ఫ్రాన్స్ లోని కేన్స్ నగరం వేదికగా మంగవాళం గ్రాండ్‌గా మొదలయ్యాయి. ఈ సారి ఫెస్టివల్లో ఇండియా నుంచి హాజరైన వారిలో స్వరమాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రెడ్ కార్పెట్ వాక్ చేసి సందడి చేశాడు మ్యూజిక్ మ్యాస్ట్రో.
ఏఆర్ రెహమాన్ డైరెక్టర్‌గా మారి తెరకెక్కిస్తున్న చిత్రం లే మస్క్ (Le Musk). ఇండియన్ వర్చువల్ రియాలిటీ ఫిలిమ్‌గా వస్తున్న ఈ చిత్రం కేన్స్ ఫెస్టివల్లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్బంగా తన ఎక్జయిట్ మెంట్‌ను మీడియాతో పంచుకున్నాడు ఏఆర్ రెహమాన్. ‘ఇక్కడకు రావడం చాలా గౌరవంగా ఉంది. నా తొలి డైరెక్టోరియల్ డెబ్యూ లే మస్క్ ప్రీమియర్ కానుండటంతో మా టీం అంతా ఎక్జయిటింగ్‌గా ఉందన్నా’డు ఏఆర్ రెహమాన్.
‘ఇండియా దగ్గర చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ఇండియా సినిమాల కథల నాణ్యత, మేకింగ్ చాలా బాగుంటుంది.
ఇది మంచి ప్రారంభ సూచిక. సినిమాల పంపిణీ, సున్నిత అంశాలను, కథనాలను ఇంకా వేగంగా పని చేయాల్సి ఉందని భావిస్తున్నానన్నారు. ప్రధాని మోడీ సందేశం సరైంది. ఎందుకంటే ఈ ప్రపంచం నుంచే (భారత్) కథనాలు రావాల్సి ఉంది. అంతర్జాతీయ సినిమాలు ఎప్పుడూ పాశ్చాత్య దేశాలకు సంబంధించినవే. గత 20 సంవత్సరాలుగా చాలా మారుతున్నాయని’ ఏఆర్ రెహమాన్ చెప్పుకొచ్చాడు.