Sonali Bendre | రాజ్ థాకరేతో అనుంబంధం అంటూ వార్తలు.. సోనాలి బింద్రే స్పందన ఇదే..!
Sonali Bendre | బాలీవుడ్ నటి సోనాలి బింద్రే గురించి పరిచయం అవసరం లేదు. హిందీ, తమిళం, కన్నడ సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. పెళ్లి తర్వాత కొద్దికాలం సినిమాలకు దూరమైంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
Sonali Bendre | బాలీవుడ్ నటి సోనాలి బింద్రే గురించి పరిచయం అవసరం లేదు. హిందీ, తమిళం, కన్నడ సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. పెళ్లి తర్వాత కొద్దికాలం సినిమాలకు దూరమైంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, సోనాలి బింద్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధినేత రాజ్ థాకరేకు సంబంధించిన ఓ పాత వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే, దీనిపై సోనాలి బింద్రే స్పందించింది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. రాజ్ థాకరేకు సోనాలిపై ప్రేమ ఉండేదనే వార్తలను తోసిపుచ్చారు. ‘రాజ్ థాకరే నాకు అప్పట్లో క్రష్ ఉండేదా? అన్న ప్రశ్నకు సోనాలి బింద్రే స్పందిస్తూ.. తనకైతే ఆ విషయం అనుమానమేనని చెప్పింది. వైరల్ అయిన వీడియో గురించి వివరించాలంటే.. ఆ సమయంలో తాను తన సోదరితో మాట్లాడున్నానని చెప్పింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం వల్ల కుటుంబాలు, వ్యక్తిత్వాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి విషయాలు ప్రస్తావించడం సరైన పద్ధతి కాదని..
సోనాలి బింద్రే తన కుటుంబం, రాజ్ థాకరే కుటుంబం మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా బావగారు క్రికెటర్ అని.. ఆయన, రాజ్ థాకరే కజిన్లు కలిసి క్రికెట్ ఆడేవారని.. మా సోదరి కుటుంబంతో వారికున్న పరిచయం అలా మొదలైందని తెలిపారు. తాను చదువుకున్న రామ్‌నారాయణ్ రుయా కాలేజీలో మా సోదరి అత్తగారు ఇంగ్లీష్ విభాగానికి హెడ్‌గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబం, రాజ్ థాకరే కుటుంబం మధ్య అనుబంధం దశాబ్దాలనాటిదన్నారు. రాజ్ థాకరే సతీమణి షర్మిలా అమ్మగారు తన చిన్నమ్మ మంచి స్నేహితులని.. తాను పుట్టినప్పుడు ఆసుపత్రికి వచ్చి నన్ను చూసి వెళ్లారన్నారు. తాను మహారాష్ట్రకు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వచ్చేదాన్ని, కాబట్టి వారితో అలా పెద్ద పరిచయం లేదన్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉందా? అని ప్రశ్నించగా.. లేదన్నారు. రాజకీయాల్లో ఉండాలంటే మొండి తనం కావాలని.. అది తనవద్ద లేదన్నారు. రాజకీయాల్లో తాను ఉండలేనన్నారు.
EP-305 with Sonali Bendre premieres today at 5 PM IST
“We were not the best of friends…” – Sonali Bendre on working with Salman Khan during ‘Hum Saath-Saath Hain’
More on viral video from an event with Raj Thackeray, battle with cancer, and her new book#SmitaPrakash… pic.twitter.com/e4CjHdOnlf
— ANI (@ANI) June 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

